నటి కరాటే కల్యాణి ఇంటికి ఛైల్డ్ వెల్ఫేర్ అధికారులు

-

ఇటీవల యూ ట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి – నటి కరాటే కల్యాణికి మధ్య జరిగిన వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే.. మరోసారి నటి కల్యాణి వార్తల్లో నిలిచారు. ఎఆర్ నగర్ పరిధిలోని రాజీవ్ నగర్ లో ఉంటున్న ఆమె ఇంటికి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు వెళ్లారు. ఇటీవలే ఓ చిన్నారని దత్తత తీసుకుందని.. అయితే.. అక్రమంగా..ఆ చిన్నారని తెచ్చుకున్నారని ఫిర్యాదు వచ్చిందని అధికారులు తెలిపారు. చిన్నారి వివరాలను ఆరా తీస్తున్నారు. అయితే.. అధికారులు వచ్చిన సమయంలో నటి కరాటే కల్యాణి ఇంట్లో లేకపోవడం గమనార్హం. చిన్నారి కూడా లేదని తెలుస్తోంది. చట్ట ప్రకారమే చిన్నారని తెచ్చుకున్నామని మీడియాకు తెలిపారు నటి కరాటే కల్యాణి తల్లి.

దీనిపై ఛైల్డ్ వెల్ఫేర్ కు చెందిన అధికారి మాట్లాడుతూ.. నటి కరాటే కల్యాణి ఇంటికి అక్రమంగా చిన్నారని తెచ్చుకున్నారని తమకు సమాచారం వచ్చిందని.. దీనిని తమ కో ఆర్డినేటర్ కు తెలియచేయడం జరిగిందన్నారు. తాము ఎస్ఆర్ నగర్ పోలీసుల సహకారంతో ఇక్కడకు రావడం జరిగిందన్నారు. ఇంట్లో 11 ఇయర్స్ బాబు కూడా ఉన్నాడని చెబుతున్నారని, ఆమె సంగారెడ్డి టెంపుల్ కు వెళ్లిందని కుటుంబసభ్యులు తెలియచేయడం జరిగిందన్నారు ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version