కారంపొడిని కూడా కల్తీ చేస్తున్న కేటుగాళ్లు

-

“ఉప్పు… పప్పు… పాలు… పిండి… కాదేది కల్తీకి అనర్హం” అన్నట్టుంది పరిస్థితి. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు సరుకులను కల్తీ చేస్తుండడం… వినియోగదారుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతీస్తోంది. తినే వస్తువు నుంచి..ఆఖరుకు నేత్తిమీద రాసుకునే నూనె వరకు కల్తీ చేస్తూ కొందరు కేటుగాళ్లు జేబులు నింపుకుంటున్నారు. దీంతో ఏ తినే వస్తువును చూసినా..ఇందులో కల్తీ ఉందా అనే అనుమానం వస్తోంది. తాజాగా కొందరు దుండగులు నకిలీ కారంపొడిని తయారు చేసి మార్కెట్లో అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ లో నకిలీ కారంపొడి తయారీ స్థావరంపై పోలీసులు దాడులు చేశారు.

వికారాబాద్ జిల్లా తాండూర్ లో నకిలీ కారంపొడి తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ నకిలీ కారం పొడి స్థావరంపై దాడి చేశారు. స్థానిక పాత కూరగాయల మార్కెట్ లోని ఎజాస్ కారంపొడి దుకాణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కొడంగల్ నియోజకవర్గంలోని రావులపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ ఈ నకిలీ కారంపొడిని తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఎండు మిరపకాయలను పట్టించి, అందులో రంగు కోసం పలు రసాయనాలు వాడుతున్నట్లు తేల్చారు. కళ్తీగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు… 2 క్వింటాళ్ల నకిలీ కారంపొడి, పలు రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version