చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శుక్రవారం ఇంట్లో ఉన్న సమయంలో తనపై అటాక్ చేశారని రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 20 మంది ఇక్ష్వాకుల వారసులమంటూ వచ్చి రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని కోరగా నిరాకరించడంతో తనతో పాటు కుమారుడిపై దాడి చేసారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలుస్తోందని మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడిపై 20 మంది దాడి.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ చిలుకూరు పై దాడి చేసిన రామ రాజ్యం సంస్ధకు సంబందించిన వ్యక్తులు ఆలయ బాధ్యతలు అప్పగించి తమ సంస్థలో చేరాలని రంగరాజన్ ను బెదిరించారని సమాచారం. పోలీసులకు ఫిర్యాదు చేసారు రంగరాజన్ తండ్రి.