భారతీయ వెబ్‌సైట్లను బ్యాన్‌ చేసిన చైనా..

-

చైనా దేశం భారతీయ వెబ్‌సైట్లను బ్యాన్‌ చేసింది. భారత్‌కు చెందిన మీడియా సంస్థల వెబ్‌సైట్లన్నింటినీ బ్యాన్‌ చేసినట్లు చైనా ప్రకటించింది. భారత్‌ సోమవారం రాత్రి చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన విషయం విదితమే. అయితే ఇందుకు కౌంటర్‌గానే చైనా.. ఇండియన్‌ వెబ్‌సైట్లను బ్యాన్‌ చేసిందని అంటున్నారు. కానీ ఇండియా.. చైనా యాప్‌లను నిషేధించాలని నిర్ణయం తీసుకోకముందే.. చైనా మన దేశ సైట్లను నిషేధించాలని నిర్ణయం తీసుకుందట.

అయితే సాధారణంగా ఏ దేశంలో అయినా సరే బ్లాక్‌ చేయబడిన సైట్లు, యాప్‌లను యాక్సెస్‌ చేసేందుకు వీపీఎన్‌ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కానీ చైనాలో ఆ సర్వీసులు కూడా ప్రస్తుతం పనిచేయడం లేదని తెలిసింది. వీపీఎన్‌ సర్వీసులను కూడా నిలిపివేసే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా డెవలప్‌ చేసినట్లు తెలుస్తోంది.

కాగా ప్రస్తుతానికి భారత్‌కు చెందిన వెబ్‌సైట్లను మాత్రమే చైనాలో బ్యాన్‌ చేశారు. కానీ టీవీ చానళ్లు మాత్రం ఐపీ టీవీ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఇక నిషేధం విధించబడిన యాప్స్‌లో ఒకటైన టిక్‌టాక్‌ ప్రస్తుతం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే మరి ఈ నిషేధం ఎంతకాలం ఉంటుందో తెలియదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version