కరోనా వైరస్ మొదటగా చైనాలోనే పుట్టింది. చైనా దాన్ని ఎంత కప్పి పుచ్చుకునే యత్నం చేస్తున్నా సరే.. ప్రపంచ వ్యాప్తంగా జనాల వేళ్లన్నీ చైనా వైపే చూపిస్తున్నాయి. ఇక కరోనా వైరస్ పై నిజాలను రాసే మీడియా సంస్థలపై కూడా చైనా ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. నిజాలను చెప్పే అక్కడి జర్నలిస్టులు, డాక్టర్లను ఆ దేశ ప్రభుత్వం కనిపించకుండా చేస్తోంది. ఇక తాజాగా మరో మీడియా సంస్థపై కూడా చైనా నిషేధం విధించింది. ఆ సంస్థ భారత్‌కు చెందినది కావడం విశేషం.
చైనా ప్రభుత్వం తమ దేశంలోని చాలా చోట్ల భారత్‌కు చెందిన WION అనే మీడియా సంస్థకు చెందిన వెబ్‌సైట్ www.wionews.com ను బ్లాక్ చేసింది. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్ అక్కడ ఓపెన్ కావడం లేదు. ఈ విషయాన్ని అక్కడి ఇంటర్నెట్ పర్యవేక్షణ సైట్ GreatFire.org ధ్రువీకరించింది. చైనాలో కరోనా వైరస్ విజృంభణ, కేసులను కప్పిపుచ్చే ధోరణిపై గత కొద్ది రోజులుగా WION కథనాలను పోస్ట్ చేస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం WION సైట్‌ను బ్లాక్ చేసింది.
అయితే చైనా ప్రధాని జిన్ పింగ్, ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్‌లు WION పై విమర్శలు చేశారు. ఆ తరువాతే WION ను బ్లాక్ చేశారు.