మనల్ని నమ్మించి మోసం చేసిన చైనా…!

-

కరోనా వైరస్ విషయంలో ప్రపంచాన్ని అన్ని విధాలుగామోసం చేసింది చైనా. వాస్తవాలను ఏ ఒక్కటి కూడా బయటపెట్టకుండా… కరోనా విషయాన్ని దాచి మరణాలను దాని తీవ్రతను అన్ని విధాలుగా దాస్తూ వచ్చింది గాని ఏ ఒక్కటి కూడా నిజం చెప్పలేదు. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ కూడా చైనాను ఈ విషయంలో దోషిగా చూస్తూ వస్తున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు మన దేశాన్ని కూడా మోసం చేసింది.

కరోనా టెస్ట్ కిట్స్ ని మన దేశం చైనా నుంచి దిగుమతి చేసుకునే ప్రయత్నం చేసింది. లక్షల కిట్స్ ప్రత్యేక విమానం లో చైనా నుంచి మన దేశానికి వచ్చాయి. ఇప్పుడు ఈ కిట్స్ లో ఏ మాత్రం కూడా నాణ్యత లేదు అనే విషయాన్ని గుర్తించారు. మన దేశంలో ఇప్పుడు వీటిని వాడాలి అని అనుకుని సిద్దం అయ్యారు. రాజస్థాన్ లో కరోనా పరిక్షలు చేయగా కేవలం ఆరు శాతం మాత్రమే కచ్చిత ఫలితాలు వచ్చాయి.

94 శాతం తప్పుడు ఫలితాలు వచ్చాయి. దీనితో మాకు ఈ కిట్స్ వద్దని రాజస్థాన్ సర్కార్ వాటిని తిరస్కరించింది. దీనిపై స్పందించిన ఐసిఎంఆర్ మేము చెప్పే వరకు ఎవరూ కూడా వాటిని వినియోగించ వద్దు అని స్పష్టం చేసింది. కేంద్ర ప్రత్యేక బృందాలు ఇప్పుడు వాటి పని తీరుని పరిశీలించడానికి రంగంలోకి దిగాయి. దీని వెనుక చైనా ఉద్దేశం భారత్ ని మోసం చేసి కరోనా మయం చేయడమే అని అంటున్నారు. అందుకే ఆ దేశం ఇలా వ్యవహరించింది అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version