చైనాలో కరోనా తీవ్ర స్థాయిలో ఉందా…? అంతర్జాతీయ సమాజం ముందు చైనా నిజాలు దాస్తుందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. వాస్తవానికి కరోనా వైరస్ తీవ్రత విషయంలో ముందు నుంచి కూడా చైనా వ్యవహారశైలి తీవ్ర విమర్శలకు వేదికగా మారింది. అసలు కరోనా వైరస్ రెండు నెలల క్రితమే బయటపడితే ఆ వైరస్ విస్తరించే వరకు కూడా చైనా అనుమానాస్పదంగా వ్యవహరించింది.
కరోనా వైరస్ గురించి లండన్ పరిశోధకులు ఆ దేశాన్ని హెచ్చరించినా పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇదిలా ఉంటె ఇప్పుడు ఆ దేశం అంతర్జాతీయ సమాజ౦ ముందు తన తప్పులను దాస్తుందని అంటున్నారు. నూటికి నూరు పాళ్ళు కరోనా అనేది చైనా సృష్టించినదే అంటున్నారు. ఇక ఇదిలా ఉంటె కరోనా ఇప్పటి వరకు 50 మందికి పైగా సోకింది అనేది అంతర్జాతీయ మీడియా చెప్తున్న మాట.
ఇక మృతుల సంఖ్య వేలల్లో ఉన్నా చైనా వందలలోనే చెప్తుంది. ఇక వ్యాధి తీవ్రతగా గురించి పలు దేశాలు నోరు తెరిచే వరకు కూడా చైనా పెద్దగా స్పందించే సాహసం చేయలేదు అనేది ఇప్పుడు అంతర్జాతీయ మీడియా మాట. వ్యాధి సోకిన వాళ్ళను లైట్ తీసుకోవడమే కాకుండా వ్యాధి బయటపడిన తర్వాత దాని తీవ్రతను అంచనా వేసినా కూడా జాగ్రత్తలు తీసుకోలేదు చైనా. అందుకే ఇప్పుడు అక్కడ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.