కిమ్ చనిపోయారు, చెప్పేసిన చైనా…?

-

ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చనిపోయారా…? అంటే అవుననే సమాధానం చెప్తుంది చైనా. ఆయన మరణం అంతర్జాతీయ మీడియాలో ఇప్పుడు ఒక సంచలనం. అసలు ఆయన ఉన్నారా లేదా అనే దాని మీద ఇప్పటి వరకు ఏ స్పష్టతా లేదు. ఆయన మరణించే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ వ్యాప్తంగా పలు వార్తా సంస్థలు తమకు ఉన్న ఆధారాలతో చెప్తున్నాయి. ముందు వాటిని ఖండించిన పొరుగుదేశం దక్షిణ కొరియా…

ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కిమ్‌ అనారోగ్యానికి గురయ్యాక.. చైనా తమ దేశ వైద్య నిపుణుల బృందాన్ని ఉత్తర కొరియాకు పంపింది. ఆ బృందం కిమ్‌ను పరీక్షించినట్లు ఆయన చనిపోయారని చెప్పినట్టు సమాచారం. ఇక కిమ్ మరణం విషయంలో చైనా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఉత్తరకొరియా తో ఆయుధ పరంగా చూస్తే చైనాకు చాలా అవసరాలు ఉన్నాయి. అందుకే కిమ్ బ్రతకాలని చైనా చివరి వరకు ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది.

ఆయన మరణిస్తే చైనాకు చాలా నష్టాలు ఉంటాయి. ఇన్నాళ్ళు ఆయన్ను అడ్డం పెట్టుకుని అమెరికాను బెదిరించింది చైనా. ఆ స్థాయిలో మరో నేత తయారు కావాలి అంటే సాధ్యం కాదు. ఇక అన్ని దేశాల మీడియాలో ఆయన చనిపోయారు అని అనడం, చైనాతో ఎడమొహం పెడ మొహంగా ఉండే జపాన్ మీడియా కూడా చనిపోయారని పక్కాగా చెప్పడంతో చైనాకు ఇక నిజం బయటపెట్టక తప్పలేదు. ఆయన శనివారం రాత్రి తుది శ్వాస విడిచారని జపాన్ మీడియా చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version