చైనా వ్యాక్సిన్ నాసిరకమే..!?

-

చైనాకు సంబంధించిన ఏ వస్తువు నాసిరకమే అని చాలా మంది భావిస్తుంటారు. నిజమే.. అప్పుడప్పుడు చైనా ప్రొడక్ట్స్ విషయంలో అదే జరుగుతుంది కూడా. చైనా సామగ్రిలు ఎక్కువ కాలం వరకు స్టాండర్డ్ గా ఉండవని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా కరోనా వ్యాక్సిన్ విషయంలో కూడా అదే రుజువైంది. కరోనా నిర్మూలన విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న టీకాల్లో అత్యల్ప సామర్థ్యం ఉన్న చైనాదేనని బ్రెజిల్ కి చెందిన పరిశోధకులు మంగళవారం ప్రకటించారు. చైనా ప్రభుత్వానికి చెందిన కరోనా వ్యాక్సిన్ సినోవాక్ టీకా కరోనా నిర్మూలన సామర్థ్యం కేవలం 50.4 శాతమేనని తేల్చిచెప్పారు. సాధారణంగా ఒక టీకా ఆమోదం పొందాలంటే 50 శాతం సామర్థ్యం ఉంటే చాలని, చైనా టీకా ఆ మార్కును మాత్రమే దాటిందని ప్రయోగాల్లో తేలిందన్నారు.

covid-19-vaccine

మెక్రోబయాలజిస్టు నటాలియా పాస్టెర్నక్ మాట్లాడుతూ..‘‘సినోవాక్ ఫలితాలు బ్రెజిల్ దేశాన్ని తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఇది మంచి టీకాయే. కానీ ప్రపంచంలో ఇది అత్యుత్తమమైనది కాదు. వేరే వ్యాక్సిన్లకు ఆదర్శమైనది కాదు.’’ అంటూ పేర్కొన్నారు. అప్పట్లో సినోవాక్ టీకా 78 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉందని బ్రెజిల్ కు చెందిన బటాంట ఇనిస్టిట్యూట్ పాక్షిక ఫలితాల్లో ప్రకటించినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. దీంతో ఆ ప్రకటనలపై ప్రస్తుతం విమర్శలు వెలువెత్తుతున్నాయి. స్వల్ప నుంచి తీవ్రమైన కేసుల విషయంలో 78 శాతం పని చేస్తుందని పేర్కొంది. కానీ తాజా ప్రయోగాల్లో వ్యాక్సిన్ సామర్థ్యం 50.4 శాతానికి తగ్గిపోయిందని తేలింది.

బటాంట ఇనిస్టిట్యూట్ ప్రకటించిన వ్యాఖ్యలపై సావోపాలోని పబ్లిక్ హెల్త్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గొన్జా అసహనం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలని పేర్కొన్నారు. అయితే ఈ టీకా తీసుకున్నవారికి సైడ్ ఎఫెక్ట్ రాకపోవడం మంచి పరిణామమని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇప్పటికే చైనా టీకా ప్రయోగ పరీక్షలు, కొనుగోళ్లుకు సంబంధించి చాలా దేశాల్లో ఒప్పందం కుదర్చుకుంది. కానీ అన్ని దేశాలకు షరతులు పెట్టడంతో ఆయా దేశాలు టీకా కొనుగోలు నుంచి తప్పుకున్నాయి. దీంతో చైనానే ‘అత్యవసర వినియోగం’ పేరుతో విచ్చలవిడిగా వాడేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version