భారత్‌ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చైనా.. కారణం అదేనట..!

-

భారత ప్రభుత్వం తాజాగా మరో 47 చైనీస్ యాప్‌లపై నిషేధం విధించడంపై ఢిల్లీలోని చైనీస్ ఎంబసీ స్పందించింది. చైనీస్ యాప్‌లను నిషేధించడంపై నిరసన వ్యక్తం చేస్తూ, ఇది ఉద్దేశపూర్వక జోక్యమని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని చైనా హెచ్చరించింది. చైనా వ్యాపార సంస్థల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు చైనీస్ ఎంబసీ అధికార ప్రతినిథి జి రోంగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘వుయ్‌చాట్’ యాప్‌ను నిషేదించడంపై భారత ప్రభుత్వంతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.

వుయ్‌చాట్‌తోపాటు చైనీస్ నేపథ్యం ఉన్న 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిందన్నారు. దీనివల్ల చైనా కంపెనీల చట్టబద్ధ హక్కులు, ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిందన్నారు. కాగా, గతంలో టిక్‌టాక్ సహా 59 మొబైల్ యాప్‌లను నిషేధించింది. తాజాగా వీటికి క్లోన్‌లుగా పని చేస్తున్న మరొక 47 యాప్‌లను నిషేదించింది. మొత్తం మీద 250 చైనీస్ యాప్‌లను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version