భారతీయులు సిగ్గు పడాలి: సింగర్ చిన్మయి

-

సింగర్ చిన్మయి ఇండియా పై మండిపడ్డారు ఇటీవల జార్ఖండ్ లోని దుమ్కాజిల్లాలో స్పానిష్ టూరిస్ట్ మీద సామూహిక అత్యాచారం ఘటనపై స్పందిస్తూ భారతీయులు సిగ్గుపడాలి అన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా వుంటారు. మహిళలపై జరుగుతున్న దారుణాల మీద సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు. స్పెయిన్ మహిళా అత్యాచార ఘటన పై ఎక్స్ లో ఈ విధంగా రాసుకు వచ్చారు.

కొంతమంది భారతీయులు ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్నప్పుడు భారతీయులందరూ గర్వపడగలిగితే కొంతమంది పురుషులు అత్యాచారం చేసినప్పుడు భారతీయులందరూ సిగ్గుపడాలని పోస్ట్ చేశారు. ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ నటి రిచా కూడా ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులకి చట్టపరంగా శిక్ష పడాలని డిమాండ్ చేశారు. స్పెయిన్ మహిళ తన భర్తతో పాటుగా విదేశాల్లో పర్యటిస్తున్న క్రమంలో కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పాల్పడ్డ విషయం తెలిసిందే దీంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version