ఆ పని తెలంగాణ ప్రతిష్ట కోసమే చేశా : కేటీఆర్

-

ఫార్ములా ఈ కారు రేసు కేసులో తానేమీ క్విడ్‌ ప్రో కోకు పాల్పడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏసీబీ కార్యాలయానికి వెళ్లే మందు నంది‌నగర్‌లోని తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న టైంలో తమ బామ్మర్దులకు రూ.1,137 కోట్ల కాంట్రాక్టులు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.మంత్రిగా తాను కేబినెట్‌లో కూర్చొని ఏకంగా కొడుకు కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చుకోలేదని మండిపడ్డారు.

అప్పనంగా వచ్చిన సొమ్ముతో ల్యాండ్‌ క్రూజర్ కార్లు కొనుక్కోలేదని, తాను రూ.50 లక్షలతో ఎమ్మెల్యేలను కొనడానికి పోయి అడ్డంగా దొరికిన దొంగను కాదని విమర్శించారు. తాను నిఖార్సైన తెలంగాణ బిడ్డను అని కామెంట్ చేశారు. ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహణలో అర పైసా అవినీతి కూడా తాను చేయలేదని, తెలంగాణ ప్రతిష్ఠను పెంచడానికే ఈ-రేసును నిర్వహించినట్లు తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడానికే తాము ప్రయత్నం చేశామని వెల్లడించారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version