Chinmayi Sripada: మగ‌వారు ఆ అవసరం కోస‌మే పెళ్లి చేసుకుంటున్నారు.. చిన్మ‌యి షాకింగ్ కామెంట్స్

-

Chinmayi Sripada: సింగర్ చిన్మయి.. టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది చిన్మయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. మహిళలు ఎదుర్కొనే సమస్యలపై ఎప్పుడూ త‌న వాయిస్ రేజ్ చేస్తునే ఉంటుంది. బహిరంగంగా పోరాడింది. ఈ క్ర‌మంలో పిల్ల‌లు త‌మ త‌ల్లి దండ్రుల‌కు చెప్పుకోలేని కొన్ని బాధల‌ను చిన్న‌యితో పంచుకున్నారు. వారికి చిన్మ‌యి సలహాలు ఇస్తూ.. ధైర్యం కల్పిస్తుంటుంది. ఇటీవల అమ్మాయిలు పెళ్లి తర్వాత ఉద్యోగం చేయవచ్చా ? అనే అంశంపై తన స్టైల్లో వివరణ ఇచ్చింది చిన్మయి.

ఓ అమ్మాయి తన సమస్యను చిన్మయితో చెప్పుకుంటూ.. మేమిద్దరం ఆడపిల్లలం.. మాకు సోద‌రులు లేరు. ఇటీవల నా పెళ్లి ఫిక్స్ సెట్ అయింది. కట్నంగా భారీ మొత్తమే అడిగారు. అయితే.. రెండు సంవత్సరాల పాటు నా జీతాన్ని నా తల్లిదండ్రులకు ఇస్తాన‌ని చెప్పినా.. అందుకు ఆ అబ్బాయి తల్లి ఒప్పుకోలేదు.. అలా ఎలా చేస్తావ్.. నీ జీతాన్ని మాకే ఇవ్వాల‌ని చెప్పింది అంటూ రాసుకోచ్చింది.

ఇక, ఆ అమ్మాయికి పోస్ట్ పై చిన్మయి త‌న‌దైన శైలి సీరియస్ కామెంట్స్ చేసింది. ఎవరికి ఎవరి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఎవరి కష్టార్జితం వారిది.. మీ నాన్న ఎంతో కష్టపడి సంపాందించిన సొమ్మును ఎవ్వరకీ రాసివ్వాల్సిన పనిలేదు. మీ తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకునే హ‌క్కు నీకు కూడా ఉంది. నీ జీతాన్ని ఎవ‌రికి ఇవ్వాలో నిర్ణయించుకునే హక్కు నీకుంది. అంటూ సీరియ‌స్ అయింది.

నీ డ‌బ్బుల మీద మీ అత్తగారి పెత్తనమేంటీ? పెళ్లి అంటే ఆర్థిక లావాదేవీల వ్య‌వ‌హ‌రమా? ఒకరు నష్టపోవడం.. మరోకరు లాభపడటమా? అంటూ ప్ర‌శ్నించింది. మగవారి త‌మ కుటుంబాన్ని పెంపొందించడం కోసమే పెళ్లి చేసుకుంటున్నారు. ఆడవారికి అలా అవసరం లేదు.. అలాంటప్పుడు అబ్బాయికి పెళ్లి చేయాల్సి అవసరం లేదు. పెళ్లి కోసం అంత ఖర్చు అవసరం లేదు.. ఎవరి కష్టార్జితం వారిది..డబ్బు కావాలంటే సంపాదించుకోండి చెప్ప‌మ‌ని చిన్మ‌యి ధైర్యం చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version