లాక్డౌన్ ఎఫెక్ట్: కూరగాయలు అమ్ముతున్న చిన్నారి పెళ్ళికూతురు డైరెక్టర్.

-

చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. హిందీలో సూపర్ హిట్ అయిన బాలికా వధు సీరియల్ ని తెలుగులో చిన్నారి పెళ్ళికూతురుగా అనువాదం చేసారు. అందులో నటించిన బాలనటి అవికాగోర్, ఆ తర్వాత ఉయ్యాలా జంపాలా సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది. ఐతే ఈ సినిమా దర్శకుడు ప్రస్తుతం కూరగాయలు అమ్ముకుంటున్నాడు. లాక్డౌన్ ఎఫెక్ట్ కారణంగా సినిమాలు లేకపోవడంతో దర్శకుడు రామ్ వ్రిక్షా గౌర్ తన స్వంత గ్రామంలో కూరగాయలు అమ్ముకుంటూ కనిపించాడు.

ఈ విషయమై స్పందించిన దర్శకుడు, ఒకానొక సినిమా పనుల మీద తన స్వంత గ్రామ వచ్చానని, అంతలోనే మహమ్మారి విజృంభించడంతో లాక్డౌన్ పడి తన గ్రామంలోనే ఉంటున్నానని తెలిపాడు. తాను పనిచేస్తున్న సినిమా నిర్మాత, నిర్మాణ పనులని వచ్చే సంవత్సరానికి వాయిదా వేసాడట. దాంతో చేతిలో పనిలేకుండా పోయింది. ఊర్లోనే ఉంటున్నాడు గనక వాళ్ల నాన్నగారి కూరగాయల వ్యాపారాన్ని చూసుకుంటున్నాడట. మళ్లీ పరిస్థితులు సాధారన స్థితికి రాగానే తన చేతిలో ఉన్న సినిమాని తెరకెక్కిస్తాడట.

Read more RELATED
Recommended to you

Exit mobile version