ప‌వ‌న్‌కు భారీ షాక్‌…జ‌న‌సేన‌కు సీనియ‌ర్ గుడ్ బై..!

-

నా పార్టీకి తిరుగులేదు.. నేను రాజ‌కీయాల‌ను విడిచేది లేదు.. నా పార్టీ నేత‌లు ఎవ‌రు పార్టీని వీడిపోరు.. నా వెంటే ఉంటారు.. అంటూ నిత్యం సోష‌ల్ మీడియాలోనే క‌నిపించే సినిమా స్టార్, జ‌న‌సేన అధినేత‌కు ఇప్పుడు భారీ షాక్ త‌గిలింది. జ‌న‌సేన పార్టీని ఒక్కొక్క నేత వీడిపోతున్నారు. ప‌వ‌ర్ లేని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హార‌శైలీ బాగాలేద‌ని అసంతృప్తి వెళ్ల‌గ‌క్కుతూ ఒక్కొక్క‌రు పార్టీని వీడుతున్నారు.. ఇప్పుడు ఏకంగా జ‌న‌సేన పార్టీ సీనియ‌ర్ నేత‌, గ‌వ‌ర్న‌మెంట్ ప్రోగ్రామ్స్ మానిట‌రింగ్ చైర్మ‌న్ చింత‌ల పార్థ‌సార‌థి జ‌న‌సేనను వీడిపోయారు. పార్టీ స‌భ్య‌త్వానికి, పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేస్తూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు లేఖ రాశారు.

ఇప్పుడు జ‌న‌సేన పార్టీకి ప‌ట్టుగొమ్మ అయిన ఓ కీల‌క విభాగం చైర్మ‌న్ పార్టీకి రాజీనామా చేయ‌డ‌మంటే ఆ పార్టీ బ‌ల‌హీన ప‌డుతున్న‌ట్లే లెక్క‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాన్ వ్య‌వ‌హార శైలీపైనే చింత‌ల పార్ధ‌సార‌థి విమ‌ర్శ‌లు చేస్తూ పార్టీకి రాజీనామా చేయ‌డంతో ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పైనే పార్టీలో అప‌న‌మ్మ‌కం క‌లిగే స్థితిలో ఉంద‌ని అర్థం. జ‌న‌సేన మానిట‌రింగ్ చైర్మ‌న్ ప‌ద‌వికి రాజినామా చేసిన చింతల పార్థ‌సార‌థి గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌రుపున అన‌కాప‌ల్లి ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు 82, 588 ఓట్లు సాధించారు. అంటే జ‌నంలో ఎంతో కొంత ప‌లుకుబ‌డి ఉన్న నేత‌గానే భావించ‌వ‌చ్చు.

అయితే గ‌త కొంత కాలంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు పార్థ‌సార‌థికి న‌చ్చ‌లేద‌ట‌. దీంతో ఆయ‌న పార్టీకి రాజీనామా చేశారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా వైఎస్సార్ సీపీ ప్ర‌భుత్వం చేప‌డుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను విమ‌ర్శిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ క్షేత్ర‌స్థాయిలో వైఎస్సార్ పార్టీ ప్ర‌భుత్వంపై సానుకూల‌త ఉంది. కానీ జ‌న‌సేన ప్ర‌భుత్వ వ్య‌తిరేకంగా ప‌నిచేస్తుంది అంటే అది ప్రో టీడీపీగా ప‌నిచేస్తుంద‌ని పార్థ‌సార‌థి భావించి పార్టీకి రాజీనామా చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఈ నేత ఏ పార్టీలో చేరుతారో ప్ర‌క‌టించ‌లేదు.. ఇక ఇటీవ‌ల కాలంలో జ‌న‌సేన‌కు ఒక్కోక్క‌రు గుడ్‌బై చెపుతున్నారు. ఇటీవ‌లే కృష్ణా జిల్లా క‌న్వీన‌ర్ పాల‌డుగు డేవిడ్ రాజు జ‌న‌సేన‌ను వీడి బీజేపీలో చేరారు. కావ‌లి అభ్య‌ర్థి ప‌సుపులేటి సుధాక‌ర్ బీజేపీలోకి వెళ్ళారు. ఇప్పుడు వీరి బాట‌లో న‌డుస్తున్న పార్థ‌సార‌థి బీజేపీలో చేరుతారా.. లేక అధికార వైసీపీలో చేరుతారా ? అనేది త్వ‌ర‌లో తేల‌నున్న‌ది.

Read more RELATED
Recommended to you

Exit mobile version