సంక్రాంతి పండుగను తెలుగు ప్రాంతాలలో భారీ ఎత్తున జరుపుతారు. పండుగ జరిగే రోజుల్లో ఎంత చెత్త సినిమా వున్న, అది మంచి థియేటర్ కాకపోయినా హౌస్ ఫుల్ అవుతుంది. అందుకే హీరోలు సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో వుండాలని కోరుకుంటారు. ఇప్పుడు ఇలాంటి పోటీ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలయ్య వీర సింహ రెడ్డి సినిమాల ఫైట్ మామూలు లేదు. ఇప్పటికే అభిమానులు దీనిపై సోషల్ మీడియాలో ఫైట్ చేస్తున్నారు.
ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా బాలయ్య ,చిరంజీవి మధ్య థియేటర్ల కోసం టఫ్ ఫైట్ వుంది. వీరి సినిమాలతోనే మరో ఇద్దరి ఫైట్ కూడా జరుగుతోంది. వారేఎస్ ఎస్ థమన్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. వీరిద్దరూ సంగీత దర్శకుల గా టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఒకప్పుడు దేవిశ్రీ వరుస సూపర్ హిట్స్ తో టాప్ లో ఉండేవాడు..కానీ ఈ మధ్య కాలంలో థమన్ వరుస హిట్స్ అందుకుని దేవీశ్రీ తో సంగీత పరంగా, సినిమాల పరంగా ఢీ అంటే ఢీ అనేలా తయారు అయ్యాడు.
ఇప్పుడు ”వీరసింహ రెడ్డి” సినిమా తో తమన్,వాల్తేరు వీరయ్య సినిమా తో దేవీశ్రీ బరిలో దిగబోతున్నారు దీంతో ఈ మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య ఈసారి బిగ్ ఫైట్ జరగబోతుంది. దేవీశ్రీ చిరు బాస్ పార్టీ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. ఇక థమన్ కూడా తన ఫస్ట్ సింగిల్ తో రంగంలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయంలో ఇద్దరు మెయిన్ హీరోస్ కంటే వీరికే ఎక్కువ టెన్షన్ ఉందట. ఎందుకంటే సంగీతం ఏమాత్రం బాగాలేక పోయినా ప్యాన్స్ కామెంట్స్ తో కుళ్ళ బొడవడం ఖాయం అని అంటున్నారు. ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చింది అంటే ఇదే కాబోలు.