ప్రముఖ కొరియో గ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం విషమం గా నే ఉంది. అలాగే ఆయన కు కరోనా చికిత్స చేసుకోవడానికి కూడా డబ్బులు లేకుండా ఆర్థికంగా వెనకబడ్డాడు. ఇది తెలిసిన పలువురు సెలబ్రెటీ లు శివ శంకర్ మస్టర్ కు ఆర్థిక సాయం చేస్తున్నారు. తాజా గా టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి శివ శంకర్ మాస్టర్ కు సాయం చేశారు.
శివ శంకర్ మాస్టర్ చిన్న కొడుకు అజయ్ ను ఇంటికి పిలిచి.. శివ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అలాగే ఆయన వైద్య ఖర్చు ల కోసమని రూ. 3 లక్షల చెక్ ను కూడా అందజేశాడు. అలాగే తము అంతా కూడా అండ గా ఉంటామని శివ శంకర్ మాస్టర్ కుమారుడు అజయ్ కి భరోసా ఇచ్చాడు. అయితే ఇప్పటి కే శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి హెల్పిర్ స్టార్ సోను సూద్ సాయం చేస్తనని ప్రకటించాడు. వైద్య పరికారలకు అయ్యే ఖర్చు భరిస్తానని అన్నాడు. అలాగే తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి ఆర్థిక సాయం చేశాడు.