చిరంజీవి రాజకీయాల్లో లేరు…కానీ ఆయన చుట్టే రాజకీయాలు తిరుగుతుంటాయి. ఆయన ఎప్పుడో రాజకీయాలకు దూరమై…సినిమాల్లో బిజీ అయ్యారు. అయితే ఎందుకో మరి..ఆయన రాజకీయాలు వదిలిన…ఆయన్ని రాజకీయాలు మాత్రం వదలడం లేదు. అది కూడా వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ రాజకీయాల్లో చిరంజీవి పేరు ఎక్కువ వినిపిస్తోంది…సినిమా టిక్కెట్ల వ్యవహారం దగ్గర నుంచి…తాజాగా అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్న వరకు చిరంజీవి సెంటర్ గా రాజకీయం జరుగుతుంది.
జగన్ సీఎం అయిన వెంటనే…ఆయన ఇంటికి వెళ్ళి అభినందించారు..అలాగే సినిమా టిక్కెట్ల విషయంలో మొత్తం చిరంజీవి లీడ్ తీసుకుని, జగన్ తో మాట్లాడి అంతా లైన్ చేశారు. అయితే అప్పటికే చిరంజీవి…జగన్ మధ్య బాండింగ్ పెరిగిందని, త్వరలోనే చిరంజీవికి రాజ్యసభ కూడా ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి తమ్ముడుగా ఉన్న పవన్ జనసేన ద్వారా రాజకీయం నడుపుతున్నారు. పవన్ పూర్తిగా వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. దీంతో ఆయన వల్ల వైసీపీకి జరిగే డ్యామేజ్ ని చిరంజీవి ద్వారా తగ్గించుకుంటున్నారనే టాక్ కూడా నడిచింది.
అలాగే పవన్ వల్ల దూరమయ్యే కాపు ఓటింగ్ ని చిరంజీవి ద్వారా దగ్గర చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక తాజాగా ప్రధాని మోదీ సభకు చిరంజీవికి ఆహ్వానం అందింది…కానీ బీజేపీ మిత్రపక్షంగా ఉన్న పవన్ కు ఆహ్వానం అందిందో లేదో క్లారిటీ లేకుండా పోయింది. పైగా జగన్ తనకు యాంటీగా ఉన్నవారిని మోదీ సభకు రానివ్వకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు.
కానీ సభలో చిరంజీవికి పెద్ద పీఠ వేశారని చెప్పొచ్చు. అలాగే చిరంజీవి…ప్రధాని మోదీతో కూడా సఖ్యతతో ఉన్నారు. ఈ క్రమంలోనే చిరుతో, ప్రధాని ఏవో మాట్లాడడం.. అందరికీ ఆసక్తిగా మారింది. ఆయన ఏం మాట్లాడి ఉంటారు? అనే అంశంపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. మొత్తానికైతే చిరు చుట్టూ రాజకీయం బాగానే జరుగుతుంది…అయితే ఇదంతా చిరంజీవి ఆధ్వర్యంలోనే నడుస్తుందా? లేక ఎవరైనా నడిపిస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది…ఏదేమైనా చిరంజీవి ద్వారా జగన్ రాజకీయంగా బెనిఫిట్ పొందుతున్నట్లే కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
జై చిరంజీవ ✊ pic.twitter.com/GonRlh1Y4D
— Satya Rajesh Kumar Balla (@Rajeshkumrballa) July 5, 2022