‘గాడ్ ఫాదర్’గా మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ రిలీజ్

-

పుట్టిన రోజుకు ఒక్క రోజూ ముందే తన ఫ్యాన్స్‌ కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చాడు మెగాస్టార్‌ చిరంజీవి. మెగాస్టార్‌ చిరంజీవి 153 వ సినిమా కు సంబంధించిన అప్డేట్‌ ను తాజాగా చిత్ర యూనిట్‌ కాసేపటి క్రితమే ప్రకటించింది. రేపు మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు ఉన్న నేపథ్యం లో మోహన్‌ రాజా దర్శకత్వంలో చిరు నటించే సినిమా కు ”గాడ్‌ ఫాదర్‌ ” అనే టైటిల్‌ ను చిత్ర బృందం ఫిక్స్‌ చేసింది.

ఈ మేరకు ఇవాళ ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్‌ లో  బ్లాక్‌ క్యాప్‌ పెట్టుకుని.. చిరంజీవి స్టైల్‌ గా నిలుచుని ఉన్నాడు.  ఆర్బీ చైదరి తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా… ఈ మూవీకి తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి… కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆచార్య సినిమా చివరిదశ షూటింగ్ లో జరుపుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version