టాలీవుడ్ హీరో, నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం పై థియేటర్ ఓనర్స్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భారీ చిత్రాన్ని థియేటర్ల లో కాకుండా… ఓటీటీలో విడుదల చేయడం పై థియేటర్ యాజమానులు చిత్ర యూనిట్ పై నాని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నే శుక్రవారం జరిగిన తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోషియేషన్ సమావేశం నిర్వహించి టక్ జగదీష్ టీం తో పాటు, హీరో నానిపై విమర్శలు గుప్పించారు.
నానికి భవిష్యత్తు ఏంటో చూపిస్తామని.. కేవలం సినిమాల్లోనే హీరో అని.. నిజ జీవితంలో పిరికివాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. హీరో నానితో పాటు.. చిత్ర యూనిట్ పై విమర్శలు చేసిన థియేటర్ ఓనర్స్ పై చిత్ర పరిశ్రమ నుంచి పలు విమర్శలు వచ్చాయి. దీంతో ఈ వివాదం పై మనసు మార్చుకున్న తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోషియేషన్… ఇవాళ హీరో నానితో పాటు.. చిత్ర యూనిట్ కు బహిరంగా క్షమాపణలు చెప్పింది. దీంతో ఈ వివాదానికి తెరపడింది.