కొంప ముంచిన బుల్లెట్ సాంగ్ : నర్సుపై కలెక్టర్‌ సీరియస్‌

-

”నీ బుల్లెట్లు బండెక్కి వచ్చేస్తా వా ” అనే పాట కొంప ముంచింది. ఈ పాటపై డాన్స్‌ చేసిన ఓ నర్సు పై కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు. వివరాల్లోకి వెళితే… రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలంలోని పీహెచ్‌ సీ లో ఆగస్ట్‌ 15 వ తేదీన బుల్లెట్‌ బండి పాట పై ఓ నర్స్‌ డాన్స్‌ చేసింది. ఆమె డ్యాన్స్‌ కు తోటి నర్సులు కూడా చప్పట్లు కొట్టి ప్రోత్సాహించారు.

ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే.. ఈ విషయం తెలిసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌ సీరియస్ అయ్యారు. ఆస్పత్రి లో డాన్స్‌ చేసిన నర్సు ఘటన పై విచారణ కు ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌. ఈ మేరకు మెమో జారీ చేశారు జిల్లా వైద్యాధికారి సుమన్ రావు. ఈ విచారణ అనంతరం ఆ నర్సుపై చర్యలు తీసుకునే అవకావాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version