చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ల స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లాల్సిందే ..!

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి అందరికీ విదితమే. ఆయన నటించిన ‘ఆచార్య’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ క్రమంలోనే త్వరలో ఆ ఫిల్మ్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సదరు పిక్చర్ లో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్..‘సిద్ధ’అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశాడు. ఈ సంగతులు పక్కనబెడితే..చిరంజీవి నెక్స్ట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’లో బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు.

మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ నటించిన ‘లూసిఫర్’ అఫీషియల్ రీమేక్ ఇది. కాగా, ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఒరిజినల్ మలయాళం పిక్చర్‌కు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. పొలిటికల్ థ్రిల్లర్ గా ఒరిజినల్ ఫిల్మ్ ఉండగా, తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో మార్పులు చేసి, ‘గాడ్ ఫాదర్’ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నట్లు వినికిడి. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. గంగవ్వ , అనసూయ ఇతరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఈ సినిమాను మరింత స్పెషల్ చేయడం కోసం డైరెక్టర్ మోహన్ రాజా ఓ కీ రోల్ కోసం సల్మాన్ ఖాన్ ను దింపారు. చిరంజీవికి కుడి భుజం లాంటి పాత్రను సల్మాన్ ఖాన్ చేత చేయిస్తున్నారు. ఒరిజినల్ ఫిల్మ్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన ఈ పాత్రకు తెలుగులో నిడివిని ఇంకా పెంచినట్లు సమాచారం.

ఇటీవల సల్మాన్ ఖాన్ చిత్ర షూటింగ్, సన్నివేశాలు కంప్లీట్ చేశారు. కాగా, వీరిరువురిని ఒకేసారి స్క్రీన్ మీద ఆడియన్స్ చూసి మెస్మరైజ్ అయ్యేందుకు ఓ సాంగ్ ను త్వరలో షూట్ చేయబోతున్నారని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ కాగా, ఈ పాట క్యాచీగా ఉండబోతున్నదని సమాచారం. చూడాలి మరి.. ఈ పాటకు గాడ్ ఫాదర్ చిరంజీవి, భాయి జాన్ సల్మాన్ ఖాన్ ఎలా చిందేస్తారో.. అయితే వీరిరువురిని చిరంజీవి, సల్మాన్ ఖాన్ ను వెండితెరపైన ఒకే ఫ్రేంలో చూసి అభిమానులు అయితే పండుగ చేసుకుంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version