వైజాగ్ స్టీల్: ప్రైవేట్ పరం చేయద్దంటున్న చిరంజీవి..

-

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారన్న నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నష్టాలు వస్తున్నాయి కాబట్టి ప్రైవేటుకి అమ్మేస్తున్నాం అంటున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడుపుతున్నారు. ఈ ఉద్యమానికి మెగాస్టార్ చిరంజీవి తన పూర్తి మద్దతు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన మద్దతును తెలియజేసారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించడానికి ఎంతో ప్రాణత్యాగం జరిగిందని, తొమ్మిదేళ్ళ పిల్లాడు కూడా ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు.

ఆంధ్రుల హక్కు- విశాఖ ఉక్కు గా జరిగిన ఉద్యమం ఆంధ్రులందరికీ సంబంధించినదని, దాన్ని ప్రైవేటు పరం చేయడం సరికాదంటూ, ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయొద్దంటూ కామెంట్ చేసారు. కాప్టివ్ మైన్స్ కేటాయించకుండా నష్టాలు వస్తున్నాయన్న సాకు సమంజసంగా లేదనీ, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఆలోచనని మరో మారు పునః సమీక్షించుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version