మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆచార్య. ప్రస్తుతం 60 శాత౦ పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే కీలక సన్నివేశాలను షూటింగ్ పూర్తి చేసినా సరే మరికొన్ని సన్నివేశాలకు సంబంధించిన కీలక భాగాలు షూట్ చెయ్యాల్సి ఉంది. ఇక ఈ సినిమా కథ ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
దేవాదయ శాఖ అధికారిగా చిరంజీవి నటిస్తున్నారని, అందులో పురాతన దేవాలయాలను కాపాడే అధికారిగా ఆయన నటిస్తారు అనే ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా చిరంజీవి స్పందించారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యు లో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. కథ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద స్పష్టత ఇచ్చారు. అసలు ఆయన ఎం అన్నారు అనేది ఒకసారి చూస్తే…
ఈ చిత్రం ఒక సామాజిక-రాజకీయ వినోదం, ఇది సహజ వనరులను పరిరక్షించడానికి మనిషి చేసే పోరాటాన్ని చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది శారీరకంగా మానసికంగా మధన పడే పాత్ర అని ఆయన వివరించారు. ఇక కొరటాల శివ గతంలో చేసిన కమర్షియల్ సినిమాల మాదిరిగా ఇది ఉండదు అని మంచి సందేశం ఇస్తుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు..