ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డ్ పండిందని చెప్పడానికి సంతోషిస్తున్నాని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సినిమా ప్రముఖులు సమావేశం అనంతరం మీడియాలో చిరంజీవి మాట్లాడారు. ఈ చర్చకు ప్రత్యేకంగా ఆహ్వానించిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. టికెట్ ధరలపై కొన్ని నెలులగా ఏర్పడిన అనిశ్చితికి తెర పడిందని వెల్లడించారు. ఏపీలో చిన్న సినిమాాలకు ఐదో షోకు అంగీకారం తెలిపారని చిరంజీవి అన్నారు. చిన్న సినిమాకు మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ఇటు ప్రజలకు, అటు చిత్ర పరిశ్రమకు మేలు కలిగేలా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మమ్మల్ని సంత్రుప్తి పరిచిందన్నారు.
BREAKING NEWS: ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డ్ పడింది: చిరంజీవి
-