కారు పుకారు: తెలంగాణని ఆంధ్రాలో కలిపేస్తారా?

-

సెంటిమెంట్ రాజకీయాలు చేయడంలో టీఆర్ఎస్ పార్టీని మించిన పార్టీ లేదనే చెప్పాలి…సెంటిమెంట్ ద్వారా రాజకీయ లబ్ది పొందాలని టీఆర్ఎస్ నేతలు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. సరే తెలంగాణ సెంటిమెంట్ మీదే టీఆర్ఎస్ పుట్టింది…అలాగే రాష్ట్ర సాధన కోసం పోరాడుతుంది…ప్రత్యేక రాష్ట్రం వచ్చేలా చేసుకున్నారు..ఇక రాష్ట్రం తెచ్చిన పార్టీగా 2014లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌ని ఆదరించారు…గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు.

ఇక అక్కడితో సెంటిమెంట్ అయిపోయినట్లే…ఇంకా తాము చేసిన పనులని చెప్పుకుని టీఆర్ఎస్ ఓట్లు అడగాలి…కానీ 2018 ఎన్నికల్లో కూడా సెంటిమెంట్‌ని వాడుకునే రాజకీయం నడిపించారు. మరొకసారి ప్రజలు టీఆర్ఎస్‌ని ఆదరించారు. అంటే రెండుసార్లు ప్రధానంగా సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే మూడో సారి కూడా సెంటిమెంట్ అడ్డం పెట్టుకునే అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఎక్కడ ఏ అంశం దొరికిన దాన్ని రాజకీయంగా వాడుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. ఈ మధ్య కేంద్రం, తెలంగాణకు అన్యాయం చేస్తుందని చెప్పి తెగ హడావిడి చేసేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ప్రధాని మోదీ..రాష్ట్ర విభజనపై కామెంట్స్ చేశారు…గతంలో కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సరిగ్గా చేయలేదని, అలా అని తాము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, కానీ విభజన మాత్రం సరిగ్గా చేయలేదన్నట్లు మోదీ మాట్లాడారు. అదిగో మోదీకి విభజన ఇష్టం లేదని, తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తున్నారని చెప్పి…రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయడం మొదలుపెట్టాయి టీఆర్ఎస్ శ్రేణులు.

అసలు ఇంకా రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేనట్లు..టీఆర్ఎస్ నేతలంతా బీజేపీ దిష్టి బొమ్మలని దహనం చేసే కార్యక్రమం చేశారు. పైగా కొందరు నేతలు మాట్లాడుతూ..మోదీ మళ్ళీ తెలంగాణని ఆంధ్రాలో కలిపేసేలా ఉన్నారని చెప్పి తెలంగాణ ప్రజలని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. తలసాని శ్రీనివాస్, జీవన్ రెడ్డి లాంటి నేతలు ఇదే పనిలో ఉన్నారు. అసలు మళ్ళీ రాష్ట్రాలు కలవడం జరిగే పని కాదు…అయినా సరే సెంటిమెంట్ లేపి, దాని ద్వారా లబ్ది పొందాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version