మెగాస్టార్ చిరంజీవి క్లాప్ ధరించడం వెనక చిన్న కహానీ వుందని ప్రచారం మొదలైంది. హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నారని ఆ కారణంగానే క్యాప్‌తో కవర్ చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. సినీ స్టార్స్ విగ్గు పెట్టుకుని సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. కానీ ఈ మధ్య విగ్గు పెట్టుకోకుండా వెండితెరపై మరింత అందంగా హ్యాండ్సమ్‌గా కనిపించేందుకు ఆకర్షణీయమైన క్రాఫ్ లేని వారంతా హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు.
ఇదే తరహాలో మెగాస్టార్ కూడా హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నారట. ఆ కారణంగానే ఈ మధ్య బ్లూకలర్ క్యాప్‌ని మెయింటైన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల దర్శకుడు వి.వి.వినాయక్, బండ్ల గణేష్ ఓ ప్రముఖ డైరెక్టర్ కూడా ఈ మధ్య హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నారని తెలిసింది. వారిలానే చిరు కూడా ప్రయత్నించారని ప్రచారం జరుగుతోంది.