బిగ్ బాస్: సాయం కూడా సరిగ్గా చేయవా అభిజిత్..?

-

బిగ్ బాస్ లో శనివారం ఎపిసోడ్ లో ఒక వింత జరిగింది. రావడం రావడమే నాగార్జున గారు అభిజిత్ ని మాట్లాడమని చెప్పడంతో అమ్మ రాజశేఖర్ పై తనకున్న ఆరోపణలని వినిపించాడు. ఆ తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ పేరు చెప్పి టాస్కు మీద నుండి బయటకి వెళ్ళడం కరెక్ట్ కాదని, హౌస్ మేట్స్ అందరి చేత అనిపించాడు. ఐతే హౌస్ లో అంతా నాకే తెలుసని, నేనే సరిగ్గా గేమ్ ఆడుతున్నానని అభిజిత్ ఫీల్ అవుతున్నాడని చాలా మంది నెటిజన్లు అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే, మోనాల్, అవినాష్ లకి వచ్చే వారం ఇమ్యూనిటీ రావడానికి చేయడానికి హౌస్ మేట్స్ అందరికీ ఇచ్చిన టాస్కులో అభిజిత్, హారిక చేసింది ప్రేక్షకులందరికీ షాకింగ్ గా అనిపించింది. తమకి తోచిన వస్తువులని వదులుకోవచ్చని, వెయిట్ ఎక్కడ ఎక్కువ ఉంటే వాళ్ళే గెలుస్తారని, బజర్ మోగకముందే బుట్ట నింపాలని నాగార్జున చెప్పినప్పటికీ, బజర్ మోగేంత వరకూ వెయిట్ చేసి, ఆ తర్వాత తీరిగ్గా తమ సామాన్లని మోనాల్ వైపు పెట్టారు. కానీ బజర్ మోగిన తర్వాత అలా చేసినందుకు అవన్నీ చెల్లుబాటులోకి రాలేవు.

ఈ దెబ్బతో హౌస్ మేట్స్ కే కాదు ప్రేక్షకులకి కూడా అభిజిత్, హారిక లపై నెగెటివ్ అభిప్రాయం ఏర్పడిందనే చెప్పవచ్చు. మరి ముందు ముందు ఎపిసోడ్లలో అభిజిత్ ప్రవర్తన ఇలాగే ఉంటే కష్టం అని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version