జనసేన పార్టీ కోసం చిరంజీవి సంచలన నిర్ణయం !

-

జనసేన పార్టీ కోసం చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేన తరపున మెగాస్టార్ చిరంజీవి ప్రచా రం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత యాక్టర్ పృథ్వీ వెల్లడించారు.

Chiranjeevi’s sensational decision for the Janasena party

మే 5 నుంచి 11 వరకు జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో చిరంజీవి పాల్గొంటారని తెలిపారు. కూటమి అభ్యర్థులు గెలవాలని షూటింగ్ పక్కన పెట్టి ప్రచారం చేస్తారన్నారు. ఇప్పటికే మెగాస్టార్ కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో బహిరంగ సభలో పాల్గొనున్నారు పవన్. ఇక రాత్రి 7 గంటలకు తాడేపల్లిగూడెం గొల్లగూడెం సెంటర్లో బహిరంగంలో పాల్గొనున్న పవన్ కళ్యాణ్.. రేపు పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం లో పర్యటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version