దావోస్ పర్యటనలో చంద్రబాబు, రేవంత్‌ కలయిక !

-

దావోస్ పర్యటనలో గురుశిష్యుల కలయిక ఫోటో వైరల్‌ గా మారింది. తాజాగా చంద్రబాబును కలిశారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. దావోస్ పర్యటనలో చంద్రబాబును కలిశారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. జ్యూరిచ్ చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్. ఈ నేపథ్యంలోనే… ఎయిర్ పోర్టులో ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

CM Revanth Reddy and Minister Shridhar Babu who met Chandrababu politely

కాగా దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు సీఎం చంద్రబాబు నాయుడు పయనం అవుతున్నారు. కాసేపటి క్రితం జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, అధికారుల బృందం.. రేవంత్‌ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు. కాసేపట్లో పెట్టుబడిదారులతో జ్యూరిచ్‌లో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు, మంత్రులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version