జనసేన నాయకుడు, ఏపీ డిప్యూటీ సీఎం సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి వరించిన విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం ఏపీ శాసన మండలి సభ్యుడిగా జనసేన నుంచి కొణిదెల నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ మోషేన్ రాజు నాగబాబు చేత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగబాబుకు.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా చిరంజీవి తన ట్వీట్‌లో “ఏపీ విధాన పరిషత్ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకు అన్నయ్య,వదిన ఆత్మీయ అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాము’ అని రాసుకొచ్చారు.అనంతరం నాగబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసినందుకు నాగబాబుకి శుభాకాంక్షలు తెలిపారు.