శుభం: బాలయ్య షష్ఠిపూర్తి ఈవెంట్ లో చిరంజీవి!

-

జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా నందమూరి అభిమానులకు ఫుల్ పండగ! అయితే ఈ సారి ఆ పండగ వాతావరణం రెట్టింపవ్వబోతోంది. దానికి కారణం…ఇది బాలయ్య షష్టిపూర్తి సంబరం కూడా! దీంతో ఈ ఈవెంట్ ని బలంగా చేయాలని అభిమానులు ప్లాన్ చేసుకుంటుంటే… ఘనంగా చేయాలని నందమూరి ఫ్యామిలీ ప్లాన్ చేస్తుందట. ఇందులో భాగంగా ముందుగా… బాలయ్య నివాసంలో ఓ భారీ విందు ఉండబోతుందని.. ఆ విందుకు కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరుకాబోతున్నారని అంటున్నారు. అయితే… ఈ ఈవెంటుకు చిరంజీవి కూడా రాబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్!

అవును… తన స్పెషల్ బర్త్ డే వేడుకకు ఫ్యామిలీ మెంబర్స్, టాలీవుడ్ ప్రముఖులను పిలవాలని భావించిన బాలయ్య… ఆ ప్రముఖుల్లో చిరుని కూడా ఆహ్వానించాలని భావిస్తున్నారంట. ఇటీవల టాలీవుడ్ ప్రముఖులు సీఎం కేసీఆర్ ను కలిసిన విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో తమ మధ్య ఎలాంటి భేషజాలు లేవని చెప్పేందుకు బాలయ్య స్వయంగా చిరుని ఆహ్వానిస్తారని చర్చ సాగుతోంది. ఇదే క్రమంలో బాలయ్యతో ఎలాంటి సమస్యలూ లేవని చెప్పేందుకు చిరంజీవి కూడా హాజరు అవుతారని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. దీంతో బాలయ్య స్పెషల్ బర్త్ డే రోజు… వివాదం అనంతరం “చిరు – బాలయ్య” ఒకే వేదికపై ఆత్మీయంగా కలవబోతున్నారన్నమాట.

ఆ సంగతులు అలా ఉంటే… నటసింహా బాలకృష్ణ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య మరీ అంత సఖ్యత లేదని, వారిలో వారికి పడటం లేదని సాగుతున్న ప్రచారానికి మరోసారి బ్రేక్ వేయాలని భావిస్తోన్న తరుణంలో… ఈ వేడుకలో అబ్బాయ్ ఎన్టీఆర్ – బాబాయ్ బాలయ్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారని అంటున్నారు! ఈ క్రమంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రాం ఇరువురు బాబాయ్ కి అరుదైన కానుకను అందిస్తారని ఫ్యాన్స్ లో ఊహాగానాలు సాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version