కైకాల మరణ వార్త తెలుగు సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న ఈ దిగ్గజ నటుడు ఈరోజు ఉదయం తెల్లవారుజామున మరణించారు. ప్రస్తుతం ఈ నటుడు వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. కైకాల భౌతికకాయాన్ని దర్శించుకొని పలువురు సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు కూడా నివాళులు అర్పిస్తున్నారు. మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
తాజాగా చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా కైకాల సత్యనారాయణ మరణం పై ఎమోషనల్ అవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా ఒక బాగోద్వేకమైన లేఖను కూడా రాసి పోస్ట్ చేశారు. చిరంజీవి ఇలా రాసుకుంటూ.. “తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ నవరస నటన సర్వభౌముడు శ్రీ కైకాల సత్యనారాయణ గారు మృతి చెందడం నన్ను చాలా కలచి వేస్తోందని..” చిరంజీవి వ్రాసుకొచ్చారు. కైకాల గారి మరణం సినీ రంగానికే కాదు భారత సినీ రంగానికి గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటుడు.. శ్రీ కైకాల సత్యనారాయణ గారు..ఈయన పోషించినటువంటి అనేక వైవిధ్యమైన పాత్రలు బహుశా భారత దేశంలో మరే నటుడు కూడా పోషించి ఉండరని తెలియజేశారు.
కైకాల గారితో కలిసి ఎన్నో చిత్రాలలో నటించాననీ.. ఈ సందర్భంగా ఆయన నటన వైవిధ్యాన్ని వ్యక్తిత్వాన్ని దగ్గర నుంచి పరిశీలించే అవకాశం తనకు ఇచ్చినందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.. ఇక తనని ఒక తమ్ముడు అంటూ తోడబుట్టిన వాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం , ఆత్మీయత అంతకంతకు బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు. నటన, రుచికరమైన భోజనం ఈ రెండు కూడా కైకాల గారికి చాలా ఇష్టమని తెలియజేశారు. ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన ఈ లేఖ వైరల్ గా మారుతోంది.
Rest in peace
Navarasa Natana Sarvabhouma
Sri Kaikala Satyanarayana garu 🙏 pic.twitter.com/SBhoGATr0y— Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2022