మెగాస్పీడ్‌తో దూసుకెళ్తోన్న చిరంజీవి, పవన్ కళ్యాణ్

-

కుర్రాళ్ల స్పీడ్‌ ముందు సీనియర్లు కొంచెం స్లో అవుతారని చాలామందికి ఒక ఒపీనియన్ ఉంది. కానీ మెగాబ్రదర్స్‌ మాత్రం ఈ ఒపీనియన్‌ని మార్చేస్తున్నారు. యంగ్‌స్టర్స్‌ కంటే ఫుల్‌ స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఫ్యాన్స్‌కి మెగా ఎనర్జీ ఇస్తున్నారు.

మెగా ఫ్యామిలీలో అరడజను వరకు యంగ్‌హీరోస్‌ ఉన్నారు. కానీ వాళ్లందరికంటే చిరంజీవి ఫుల్ స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నాడు. రామ్‌ చరణ్‌ ‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత ఏం చేద్దాం అని ఆలోచిస్తోంటే, మెగాస్టార్ మాత్రం మూడు సినిమాలు లైన్‌లో పెట్టాడు. ‘ఆచార్య’ కంప్లీట్‌కాకముందే ‘లూసిఫర్’ రీమేక్ స్టార్ట్ చేశాడు చిరంజీవి.

చిరంజీవి ‘వేదళం’ రీమేక్‌కి కూడా డేట్ ఫిక్స్ అయ్యిందనే టాక్ వస్తోంది. మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో త్వరలోనే ఈ రీమేక్‌ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్ట్స్‌ కూడా పైప్‌ లైన్‌లో ఉన్నాయని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్‌ వచ్చే అవకాశముందని చెప్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ అయితే ఎవరూ ఊహించని రేంజ్‌లో సినిమాలకి సైన్ చేస్తున్నాడు. ఎప్పుడూ ఒక ప్రాజెక్ట్ తర్వాత మరొక ప్రాజెక్ట్ అన్నట్లు ఉంటే పవన్, కమ్‌ బ్యాక్‌లో మాత్రం గేమ్‌ చేంజ్ చేశాడు. బ్యాక్‌ టు బ్యాక్‌ మూవీస్‌తో సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. ‘వకీల్‌సాబ్’ సెట్స్‌లో ఉండగానే నాలుగు సినిమాలని ఓకే చేశాడు పవన్.

పవన్‌ కళ్యాణ్‌ ఆల్రెడీ క్రిష్‌ డైరెక్షన్‌లో ఒక హిస్టారికల్ డ్రామా స్టార్‌ చేశాడు. అలాగే సాగర్.కె.చంద్రతో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చేస్తున్నాడు. వీటితోపాటు హరీశ్ శంకర్‌తో ఒక సినిమా, సురేందర్‌ రెడ్డితో ఒక సినిమాకి సైన్ చేశాడు పవన్. మొత్తంగా పవర్‌స్టార్ ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేస్తాడని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version