‘పోలీసులు లేకండా కుప్పంలో తిరగండి చూద్దాం’: చంద్రబాబు

-

ఇటీవల ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కర్ణాటక నుంచి డబ్బు, మద్యం తీసుకొచ్చారని.. పోలీసులు లేకుండా కుప్పలంలోని ఒక్క వీధిలోనైనా తిరుగ గలరా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలను ప్రశ్నించారు. కుప్పం పర్యాటనలో భాగంగా ఆయన పార్టీ ముఖ్య నాయకులతో కలిసి సమావేశంలో నిర్వహించి మాట్లాడారు.

ముఖ్యమంత్రి జగన్‌ను చూసి ఓ నేత ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డి, రాంచంద్రా రెడ్డిని ఉద్దేశించి ప్రసంగించారు. తమ పార్టీది ప్రజా బలమైతే.. వాళ్లది పోలీసుల బలమని ఆరోపించారు. ప్రజల ముందు రాష్ట్రంలో మందు సంపూర్ణ బంద్‌ అంటు ప్రగల్బాలు పలికి కేవలం మందు నుంచే రూ. 5 వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు.

తిరుగుబాటు పారంభిస్తాం..

వైఎస్సార్‌ చేస్తున్న ఆరాచకాలపై రాష్ట్రంలోని ప్రజలంతా తిరగబడాలని జనం తిరుగుబాటును కుప్పం నుంచే ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీఎం మాట్లాడే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదని.. ఇచ్చే హామీలు ఒక్కటి చేసే పనులొక్కటి అని విమర్శించారు. ప్రజలకు రూ. 10 ఇచ్చినట్టు ఇచ్చి మళ్లీ వాళ్ల జేబులోంచి రూ.100 లాక్కుంటున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన కేవలం రెండే రెండు నెలల్లో కుప్పంకు నీళ్లందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version