చొల్లంగి అమావాస్య నాడు ఈస్టు గోదావరి జిల్లా అల్లవరం మండలం నక్కారామేశ్వరం సముద్ర తీరంలో చాలా మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే స్నానాలు ఆచరిస్తున్న సమయంలో అపశృతి చోటుచేసుకుంది. ఓ వ్యక్తి సముద్రంలో స్నానం చేస్తూ కెరటాల ఉధృతికి కొట్టుకుపోయాడు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
మృతుడు నల్లచెరువుకు చెందిన బొడ్డు వెంకట సుబ్బారావు(47)గా గుర్తించారు. మృతుడితో పాటు అతని సోదరుడు రమేష్ కూడా సముద్రంలో స్నానాలు చేసేందుకు దిగారు.ఈ క్రమంలోనే సముద్రకెరటాల ఉద్ధృతికి వెంకటసుబ్బారావు, రమేష్‌లు కొట్టుకుపోతుండగా.. అన్న గల్లంతవ్వగా స్థానికులు రమేష్‌ను కాపాడారు. కాసేపటికే వెంకట సుబ్బారావు మృతదేహం తీరానికి కొట్టుకు వచ్చింది.అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్‌కుమార్, అల్లవరం ఎస్సై హరీష్‌కుమార్ ఘటనా స్థలికి వెళ్లి ప్రమాదంపై వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.