ఉగాది నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు..?

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మహిళలకు బిగ్‌ అలర్ఠ్. ఉచిత బస్సు తాజాగా కొత్త విషయం తెరపైకి వచ్చింది. ఉగాది నుంచి మహిళలకు ఏపీలో ఉచిత బస్సు సౌకర్యం అమలయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. , సూపర్-6లో భాగంగా ఉచిత బస్సు హామీని అమలు చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Chandrababu’s decision on free travel for women in RTC buses from ugadhi

అయితే. ఈ అంశంపై సీఎం చంద్రబాబుతో ఉన్నతాధికారులు, మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఈరోజు చర్చించారు. సీఎం చంద్రబాబు కూడా పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే రిజర్వేషన్ మాదిరిగా సీట్ల సంఖ్యకు తగినట్టు మహిళలకు బస్సు ఇవ్వాలని కొందరు అంటున్నారట. ఇక పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు అనే అంశాన్ని గుర్తుంచుకుని తోటి మహిళలు సీట్లు ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారట. మొత్తానికి అన్ని సమస్యలపై దృష్టి పెట్టి… ఉగాది నుంచి మహిళలకు ఏపీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని డిసైడ్‌ అయ్యారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version