లాంగ్ గ్యాప్ తర్వాత హిట్ కొట్టిన చోటా బచ్చన్

-

చోటా బచ్చన్ కు హిట్ పడి చాలాకాలమైంది.ఇక సినిమాలు చేయడు ఆపేస్తాడని ఆ మధ్య గట్టిగానే రూమర్స్ రౌండ్లుకొట్టాయి. ఇలా తనపై ఎన్ని కామెంట్స్ వచ్చినా పట్టించుకోని అభిషేక్… తాజాగా వచ్చి పడిన హిట్ తో అందరికీ సమాధానం చెబుతున్నాడు. చోటా బచ్చన్ కు చాలా గ్యాప్ తర్వాత హిట్ పడింది.అంతకుముందు సినిమాలలో హౌస్ ఫుల్ 3 హిట్ తెచ్చి పెట్టినా…”మనమర్జియా” పేరు తీసుకువచ్చినా… ఎందుకనో అంతటి జోష్ ను అందుకోలేకపోయాడు. పడాల్సిన సాలిడ్ హిట్ ఇంకా పడలేదనే ఫీల్ లోనే అభి ఉన్నాడు.

వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ మల్టీస్టారర్ ఫిలింస్ చేస్తూ ముందుకు పోతున్న అభిషేక్ కు ఈసారి లూడో రూపంలో పెద్ద విజయమే దక్కింది.ఈ నెల 12న విడుదలైన ఈ మూవీపై విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులోని పాత్రల్ని అనురాగ్ బసు లూడో గేమ్ తరహాలో మలిచిన తీరు ఆకట్టుకుందన్న ప్రశంసలు దక్కాయి.

నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన `లూడో`ను అనురాగ్ బసు డైరెక్షన్ చేశారు. అభిషేక్ బచ్చన్- ఆదిత్యరాయ్ కపూర్- రాజ్కుమార్ రావు- పంకజ్ త్రిపాఠి- ఫాతిమా సనాషేక్లు ఇందుల్లో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈసినిమా అభిషేక్ కు మంచి మైలేజ్ ఇచ్చిన ఫిలింగా క్రిటిక్స్ ట్రీట్ చేస్తున్నారు.దీంతో చోటా బచ్చన్ లో ఉత్సాహం ఉరకలేస్తుంది.

ఇదే ఊపులో ఈనెలలో రిలీజ్ చేయడానికి “ది బిగ్ బుల్ ” కు డేట్ లాక్ చేస్తున్నారు.హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం ఈ సినిమా స్టోరీ లైన్ .ఇందులో అభిషేక్ టైటిల్ రోల్ పోషించాడు.వరుసగా వస్తున్న ఈ ప్రయోగాలతో అభిషేక్ సెర్చింగ్ హీరోలలో చోటు దక్కించుకుంటున్నాడు.ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే బిగ్ బి సంతోషానికి హద్దులు ఉండకపోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version