మందు బాబులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గుడులు, బడులు అనేది లెక్కలేకుండా ఎక్కడ బడితే అక్కడే మద్యం సేవిస్తూ తోటి వారికి ఇబ్బందులు కలిగిస్తున్నారు. మందు బాబుల వలన మహిళలు సైతం సాయంత్రం 6 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు.
తాజాగా ప్రభుత్వ పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో మందు బాబులు, విద్యార్థులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం పోస్ట్ మెట్రిక్ వసతిగృహం దగ్గరలో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూ ఉండటాన్ని గమనించిన విద్యార్థులు వారితో వాదనకు దిగారు.దీంతో ఇరువర్గాలకు మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలకు కొట్టుకుంటున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డుఅయ్యాయి. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రభుత్వ మెట్రిక్ వసతిగృహంలో ఘర్షణ..
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం పోస్ట్ మెట్రిక్ వసతిగృహం దగ్గరలో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూ ఉండటాన్ని గమనించి వారితో వాదనకు దిగిన విద్యార్థులు. pic.twitter.com/Kwpe1ExcPr
— ChotaNews App (@ChotaNewsApp) January 2, 2025