తిరుమల కొండపై మరో అపచారం జరిగింది. తిరుమల శ్రీవారి కొండపై ఆగమశాస్త్ర ఉల్లంఘన కొనసాగుతూనే ఉంది. తిరుమల శ్రీవారి ఆలయ గోపురం పై యద్దేచ్చగా విమానాలు వెళుతున్నాయి. ఆనంద నిలయం పై ఎలాంటి సంచారం జరగకూడదని గతంలోనే చెప్పారు ఆగమ పండితులు. కానీ… తిరుమల శ్రీవారి కొండపై ఆగమశాస్ర్త ఉల్లంఘన కొనసాగుతూనే ఉంది.
దీంతో తిరుమలను నో ప్లై జోన్ గా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది టిటిడి పాలక మండలి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఏపీకి చెందిన ఎంపి రామ్మోహన్ నాయుడు ఉన్నప్పటికీ ఫలితం శూన్యంగా ఉంది. తిరుమలకు ప్రాధాన్యత దృష్యా నో ప్లై జోన్ గా ప్రకటించే అవకాశం వున్నా పట్టించుకోని కేంద్రం.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భక్తులు ఆగ్రహిస్తున్నారు. ఇక ఇప్పటి కైనా.. దీనిపై కేంద్ర సర్కార్ తగిన నిర్ణయం తీసుకోవాలంటున్నారు.