సాధారణంగా ఈ కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఏ విధంగా ఉంటుంది…? ఎముకలు కోరికే చలితో ప్రజలు చుక్కలు చూస్తారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో తట్టుకోలేని చలితో జనం అల్లాడిపోయే పరిస్థితి ఉంటుంది. కాని మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చలి లేదు. కనీసం వాతావరణం చల్లగా కూడా లేదు. వింతగానూ విడ్డూరంగా ఉంది ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఇలాగే ఉంది.
చాలా చోట్ల ఆకాశం కారు మబ్బుగా కనపడుతుంది. నీలం ఆకాశం కనపడేది ఇప్పుడు ఎక్కడా ఆ పరిస్థితి లేదు. చలికాలం ఎండ చాలా మందికి ఇష్టం. అసలు ఎక్కడా ఎండ లేదు. వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చూస్తున్నారు. ఎండ అనేది లేకపోగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు జనం. ఉదయం వర్షం పడటం లేదా మధ్యాహ్నం వర్షం పడటం రాత్రి సమయాల్లో ఉక్కపోతగా ఉంటుంది.
దానికి తోడు దోమలు. అసలు జనవరి 1 రోజే వర్షం పడింది. ఆ తర్వాత కూడా ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. చల్లటి గాలి లేదు. మంచు కూడా ఎక్కడా కురవడం లేదు. గతంలో ఎక్కడ చూసినా సరే మంచు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అది ఎక్కడా కనపడటం లేదు. దీనితో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇదేం వాతావరణం రా బాబు అంటూ వింతగా చూస్తున్నారు. కలియుగం ఏంటీ ఇంత వింతగా ఉందని చర్చించుకునే పరిస్థితి.