చిందరవందరగా ఉన్న గది కారణంగా మనసుపై పడే దుష్ప్రభావాలేంటి? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

-

ఇల్లంతా చిందరవందరగా ఉంటే దాని ప్రభావం మనసు మీద చాలా ఉంటుంది. ఎక్కడి సామాన్లు అక్కడే ఉండి, ఇల్లంతా గజిబిజిగా కనిపిస్తుంటే దాని ప్రభావం మీరు చేసే పని మీద ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి పని చేయాలన్న ఆసక్తి తగ్గిపోవడం, చిరాకు, కోపం పెరగడమూ ఉంటుంది. మీ మనసు మీద ఈ చిందర వందర ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

ముందుగా కేవలం ఇల్లొక్కటే చిందరవందరగా ఉంటుందనుకుంటే పొరపాటే. మొదటగా వ్యక్తిగత చిందరవందర గురించి తెలుసుకుందాం.

వ్యక్తిగత చిందరవందర

ఇక్కడ మన శరీరానికి ఏదైనా గాయం ఏర్పడి, మాటిమాటికీ దురద పెట్టో లేదా మరో రకంగానో ఇబ్బంది పెట్టడం దగ్గరి నుండి, ఆఫీసులో కౌంటర్ మీద ఎన్నో వ్వస్తువులు ఇష్టం ఉన్నట్టుగా అమర్చడం, అనవసరమైన వస్తువులతో ఇల్లంతా గందరగోళం అవడం వరకూ ఉంటుంది. పది రకాల ఫైళ్ళు, వాడని స్టేషనరీ సామాను మొదలగు వాటితో చిందరవందరగా మారడం అనేది మీరు పనిచేసే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. మీ ఆలోచనల మీద ప్రతికూల ప్రభావం చూపించి మీ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.

ఎమోషనల్

బయటకి చెప్పని భావాలు, వైఫల్యాలు, పరిష్కారం దొరకని సమస్యలు, బంధాలు మొదలైనవన్నీ ఎమోషనల్ చిందరవందర కిందకి వస్తాయి. ఇక్కడ కొన్ని కొన్ని సార్లు ఫీలింగ్స్ ని బయటకి చెప్పేస్తే బాగుంటుంది. గతం గురించి ఎక్కువ ఆలోచించకుండా భవిష్యత్తు మీద నమ్మకం పెట్టుకుని ముందుకు సాగిపోతుంటే ఈ ఎమోషనల్ గందరగోళం నుండి బయటపడవచ్చు.

డిజిటల్

మీ ఆర్టికల్ చదువుతున్న మీరు పది, పదిహేను ట్యాబులు ఓపెన్ చేసుకుని ఏది చదవాలన్న ఆలోచనలో మునిగిపోయి, ఏమీ అర్థం కాకుండా ఉంటుంన్నారంటే మీరు కూడా డిజిటల్ గందరగోళాన్నికి గురవుతున్నారన్నమాటే. దీనివల్ల ఒత్తిడి పెరిగి పనిచేసే సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version