రఘురామ కొత్త ప్లాన్… ఢిల్లీ ఎయిమ్స్ లో జాయిన్…?

-

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఢిల్లీ బయల్దేరి వెళ్ళారు. మిలిటరీ ఆస్పత్రి నుండి డిచార్జ్ అయిన ఎంపీ రఘురామా కృష్ణ రాజు… మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ కి వెళ్ళారు. ఢిల్లీ లో మెరుగైన చికిత్స కోసమే బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానం లో రఘురామ కృష్ణం రాజు వెళ్ళారు. ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య చికిత్సలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో రఘురామ కృష్ణం రాజు బంధువులు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది.

రఘురామ కృష్ణం రాజు ను విచారించాలంటే 24 గంటల ముందు నోటీసులను ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చే అవకాశం ఉంది. సీఐడీ విచారణ కు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక రఘురామ హైదరాబాద్ లో ఉంటే మరో కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించి నేరుగా ఢిల్లీ వెళ్లిపోయారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version