కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయా పార్టీల మధ్యన వాడి వేడి విమర్శలు నోళ్లు మారుతున్నాయి. కాగా తాజాగా కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఈ ఉదయం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హత్యకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. దీనిపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ఇలాంటి వ్యక్జ్హ్యాలు చేయడం చాలా ప్రమాదకరం అని.. ఒక మనిషిని చంపడానికి బీజేపీ ప్లాన్ చేసిందని అనడం చాలా దుర్మార్గం అని సూర్జేవాలా తీరును దుయ్యబట్టారు.