అమరావతి రాజధాని నిర్ణయించడానికి కులాలు, మతాలు, ప్రాంతాలు కావాలా..? అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. తాాజాగా అమరావతి పై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లండన్ మ్యూజియంలో అమరావతి పై ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేశారని తెలిపారు. ఎవ్వరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్ ను ఆకాంక్షించే ఎలాంటి వ్యక్తి అయినా సరే కరుడు గట్టిన ఉగ్రవాది అయినా దీనికి ఒప్పుకొని తీరాలి.
రాజధాని లేని సమయంలో ఓ కమిటీ అధ్యయనం చేసింది. విశాఖ నుంచి కర్నూలు వరకు అధ్యయనం చేసారు. విజయవాడ-గుంటూరు మధ్యలో రాజదాని ఉండాలన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 15వేల ఆర్థిక లోటు ఉంది. ఇరిగేసన్, రోడ్డు, ఎయిర్ ఫోర్ట్ లు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఛేశామని తెలిపారు. 34,415 సెంట్లు రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. పేదవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో వారి వద్ద ల్యాండ్ తీసుకొని అమరావతి రాజదాని నిర్మించాం. 2500 కోట్లు రాజదానికి ఇవ్వడానికి ముందుకొచ్చారు. మాజీ సీఎం జగన్ రాజధాని అమరావతే ఉండాలని.. ఇక్కడే ఉండాలన్నారు.