టీడీపీ వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ సెట్ అవ్వాలి అని అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు అన్నారు. సమస్యలు.. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చెయ్యడం మన చేతి లో ఉంటుంది. కానీ గంజాయి అరికట్టాలంటే టైం పడుతుంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై. ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలి. ప్రజలు మెచ్చుకునే వరకు గంజాయి కంట్రోల్ లో పెట్టాలి. గంజాయి డ్రగ్స్ పై యుద్ధం చేస్తున్నాం. గంజాయి పండించే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం.
ఇక ఆడ బిడ్డల పై అత్యాచారం చేస్తే తప్పించుకోలేరు. మత విద్వేషాలు లేని వాతావరణం ఉండాలి. ముఠాలు.. కుమ్ములాటలు ఇక చెల్లవు. రాష్ట్రంలో రౌడీ లు ఉండడానికి వీల్లేదు. రౌడీయిజం చేసి తప్పించుకుంటాం అంటే కుదరదు. భూ వివాదాలు.. భూ కబ్జాలు భయంకరంగా ఉన్నాయి. భూ కబ్జాలపై ప్రత్యేక చట్టలున్నాయి.. గుజరాత్ అమలు చేస్తోంది. భూ కబ్జాలు చేసే వారికి పకడ్బందీ చట్టాలు వస్తాయి.. అలాంటి చట్టాన్ని తీసుకు వస్తాం అని చంద్రబాబు తెలిపారు.