ఈ సూపర్ టిప్స్ ని ఫాలో అయ్యారంటే.. లివర్ క్లీన్..!

-

ఈ మధ్యకాలంలో ఆరోగ్యం కోసం ఎన్నో కొత్త డైట్లను ప్రారంభిస్తున్నారు మరియు ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. అదేవిధంగా కాలేయ ఆరోగ్యం కోసం డీటాక్స్ ప్రక్రియను కూడా పాటిస్తున్నారు. ఎప్పుడైతే సరైన జీవన విధానం ఉండదో మంచి ఆహారాన్ని తీసుకోరు మరియు శరీరంలో పేరుకుపోయినటువంటి విషపదార్థాలు శుభ్రపరకుండా ఉండిపోతాయి. ఎప్పుడైతే కాలేయ ఆరోగ్యం బాగుంటుందో అప్పుడే శరీరం ఎంతో బలంగా ఉంటుంది. కాబట్టి జంక్ ఫుడ్ తినేవారు మరియు మద్యం సేవించే వాళ్ళు తప్పకుండా డిటెక్స్ ను ప్రతీ నెలా చేయాల్సి ఉంటుంది. కనుక ఈ చిట్కాలను పాటించి డిటాక్స్ ను తప్పకుండా ప్రయత్నించండి.

డీటాక్స్ చేయాలంటే తప్పకుండా మంచినీరుని ఎక్కువగా తాగాలి. కాలేయంలో ఉండేటువంటి విష పదార్థాలను బయటకు తొలగించేందుకు నీరుని త్రాగడం ఎంతో అవసరం. దాంతో సమర్థవంతంగా విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. డిటాక్సిఫికేషన్ లో భాగంగా వ్యాయామం చేయడం కూడా ఎంతో అవసరం. ఎందుకంటే చెమట రూపంలో కూడా ఎన్నో వ్యర్థ పదార్థాలు శరీరం నుండి బయటకు వెళ్లిపోతాయి. కనుక జిమ్, యోగా, వాకింగ్ వంటి మొదలైన వ్యాయామాలను ప్రతిరోజు చేయండి. కాలే ఆరోగ్యం బాగుండాలంటే పొటాషియం ఎంతో అవసరం.

అరటి పండ్లు, బీన్స్, పాలకూర, బీట్రూట్ వంటి వాటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కనుక వీటిని తినడం వలన కాలేయం శుభ్రపడుతుంది. ఎప్పుడైతే జంక్ ఫుడ్ మరియు ప్రాసెస్ చేసినటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారో అప్పుడే కాలేయ ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. కనుక ఆకుకూరలు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడం వలన కాలేయం ఆరోగ్యం ఎంతో శుభ్రంగా ఉంటుంది. దీంతో పూర్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version