రెవిన్యూ అధికారులకు పై సీఎం చంద్రబాబు సీరియస్..!

-

మంత్రి వర్గ సమావేశంలో.. మంత్రి నిమ్మల రామానాయుడు,ఇరిగేషన్ సెక్రటరీ, ఇరిగేషన్ అధికారులను అభినందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చరిత్రలో మొదటి సారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లలో 85 శాతం రిజర్వాయర్లను పూర్తి సామర్ద్యంతో నీటిని నిల్వ చేశారన్న సీఎం.. ఈ సీజన్ లో సాగు, తాగు నీటి అవసరాలకు వినియోగించగా ఇంకా 738 టిఎంసిలు, 75 శాతం నీటి నిల్వ ఉందన్నారు. మంత్రి, అధికారులు కష్టపడి పనిచేస్తే ఫలితాలు బాగుంటాయన్నారు.

అలాగే ఈ సమావేశంలో రెవిన్యూ అధికారులకు పై సీరియస్ అయ్యారు. రెవిన్యూ సదస్సుల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఎప్పుడు పరిష్కారం అవుతాయి, ఎందుకు కావడం లేదు అని ప్రశ్నించారు సీఎం. అయితే త్వరలోనే పరిష్కారం అవుతాయని చెప్పారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా. మనకు ఓపిక ఉంది.. ప్రజలకు ఓపిక ఉండాలి కదా? ప్రజలు ఎన్ని రోజులు ఎదురు చూస్తారు అని ప్రశ్నించిన సీఎం.. 22A భూములు, ఇళ్ళ స్థలాలు వెంటనే ఎందుకు పరిస్కరించలేదు అని ప్రశ్నించారు. ఇక మొత్తం సమస్యలు పరిష్కారం చేసి ఒక రిపోర్ట్ ఇస్తామని చెప్పారు మంత్రి సత్యప్రసాద్.

Read more RELATED
Recommended to you

Latest news