ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు (మంగళవారం) వరుస సమీక్షలతో బిజీబిజీగా గడపనున్నారు. శాఖల వారీగా అధికారులతో సమావేశం కానున్నారు. ముందుగా రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీ, బీసీ వెల్ఫేర్, హాండ్లూమ్స్, టెక్స్ టైల్స్ శాఖలపై మంత్రులు అధికారులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకోసం తెలంగాణ మద్యం పాలసీని ఇప్పటికే స్టడీ చేసిన అధికారులు దానిపై సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
అంతేకాకుండా, ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలకు నష్టపోయిన ప్రజలకు వరద సాయంపై కూడా చంద్రబాబు అధికారులతో సమావేశం కానున్నారు.నష్టపోయిన బాధితులకు అందించే సాయంపై నేడు సాయంత్రంలోపు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, వరద సాయం ఎప్పుడు ప్రకటిస్తారోనని ముంపు గ్రామాల బాధితులు ఆశగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం.