సిఎం తండ్రి ఆరోగ్యం విషమం… కరోనా కారణంగా వెళ్ళని సిఎం…!

-

ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం. ఆయన ఆరోగ్యం విషమించడం తో కుటుంబ సభ్యులు ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో జాయిన్ చేసారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యానికి స్పందించడం లేదని సమాచారం. ఆయనకు వైద్యులు ప్రస్తుతం వెంటిలేటర్ మీద చికిత్స కొనసాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఆయనకు గత కొన్ని రోజులుగా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా కిడ్నీ, కాలేయ సమస్యలతో ఆయన తీవ్రంగా బాధపడుతున్నారు. డయాలసిస్ కూడా చేస్తున్నట్టు సమాచారం. ఆయనను అనారోగ్య కారణంగా మార్చి 13 న ఎయిమ్స్ లో జాయిన్ చేసారు కుటుంబ సభ్యులు. గ్యాస్ట్రో విభాగానికి చెందిన డాక్టర్ వినీత్ అహుజా బృందం ఆయనకు వైద్యం అందిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక ఆయన చరిత్ర ఒక్కసారి చూస్తే… ఆనంద్ సింగ్ ఉత్తరాఖండ్ లోని యమకేశ్వర్ లోని పంచూర్ గ్రామంలో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. ఆయన అక్కడే పుట్టి పెరిగారు. ఇక ఆయన 1991లో ఉత్తరాఖండ్‌లో ఫారెస్ట్ రేంజర్ గా ఉద్యోగం నుంచి విరమణ పొందారు. ఇక అప్పటి నుంచి ఆయన అదే గ్రామంలో ఉంటున్నారు. అయితే కరోన కేసులు యుపిలో వెయ్యి దాటడం తో సిఎం తండ్రిని చూడటానికి వెళ్ళలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version